25, ఆగస్టు 2013, ఆదివారం

గిడుగు

తెలుగువారి వెలుగుదారి గిడుగు

తెలుగుభాషకు, తెలుగు జాతికి వెలుగుదీపికలై ప్రకాశించిన అతి కొద్దిమందిలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని తపిస్తూ తన జీవిత పర్యంతమూ పోరాడిన ధీశాలి. సామాన్య ప్రజలభాషకే ప్రభుత్వాలు పట్టం కట్టేలా వ్యవహారిక భాషోద్యమాన్ని మహౌన్నతంగా నడిపిన భాషావేత్త ఆయన. పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటీష్‌ పాలన దేశమంతటా బలంగా స్థిరపడుతున్న రోజుల్లో సమాజ సంస్కరణే లక్ష్యంగా ఉద్యమాలు నడిపిన ముగ్గురు తెలుగు ప్రముఖులు జాతి కీర్తికేతనాలుగా నిలిచారు. ఆ ముగ్గురు మహనీయులూ కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలను ప్రోత్సహించడం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడడం, స్త్రీ విద్యకు పునాదులు వేయడం, తన రచనలు, పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం వంటి మహత్తర కార్యాలెన్నింటినో సాధించారు. గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం చూపిన అభ్యుదయ మార్గాన్ని మరింత విస్తరింపజేశారు. సాహితీరంగంలో విశిష్ట ప్రక్రియలకు రూపకల్పన చేశారు. 'ముత్యాలసరాలు', 'పూర్ణమ్మ', 'దేశభక్తి' తదితర గీతాల్లోనూ; 'కన్యాశుల్కం' నాటకం, కథానికల ద్వారా అభ్యుదయాంశను తెలుగుజాతికి అందించారు. వీరిద్దరి కన్నా మరో అడుగు ముందుకేసిన గిడుగు సాహిత్యం, విజ్ఞానం ప్రజలకు చేరువ కావాలంటే కావ్యభాష ఎంతమాత్రమూ పనికిరాదని, వ్యవహారిక భాషలోనే రచనలు, బోధన సాగాలని ఉద్యమాన్ని నడిపాడు. ఆనాటి సాంప్రదాయ పండితులతో హౌరాహౌరీగా పోరాడి ఆధునిక ప్రమాణభాషను ప్రతిష్టింపజేసి అందరికీ మార్గదర్శకుడయ్యారు.
శ్రీకాకుళం పట్టణానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పర్వతాల పేట అగ్రహారంలో గిడుగు రామ్మూర్తి 1863 ఆగస్టు 29న జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ ఆ గ్రామంలోనే గిడుగు రామ్మూర్తి ప్రాధమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తరువాత విజయనగరంలోని మహారాజా ఇంగ్లీష్‌ పాఠశాలలో 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసయ్యారు. అదే ఏడాది ఆయనకు వివాహం జరిగింది. అనంతరం 1880లో పర్లాకిమిడి రాజా వారి పాఠశాలలో చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. 1886లో ఎఫ్‌ఎ, 1896లో బిఎ డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే కుశాగ్రబుద్ధిగా ఉన్న గిడుగు రామ్మూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలిగా సాహిత్య, భాషా రంగాల్లో కృషిచేశారు. పర్లాకిమిడిలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్న గిడుగు రామ్మూర్తి తన పరిసర ప్రాంతాల్లోని సవరుల జీవన శైలి పట్ల ఆసక్తి చూపించారు. లిపిలేని వారి భాషకు లిపిని, భాష వ్యాకరణాన్ని, ఇంగ్లీష్‌ నిఘంటువును రూపొందించారు. శ్రీముఖలింగం ఆలయంలోని శాసనాలను అధ్యయనం చేసి కళింగదేశ చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. కళింగ రాజ్యానికి ఎనిమిదో శతాబ్దం నుంచి 12 శతాబ్దం వరకూ శ్రీముఖలింగం రాజధాని అని, దానిపక్కనే ఉన్న నగరి కటకం సైనిక స్థావరమని నిరూపించారు. కళింగపట్టణం కళింగరాజ్యానికి ప్రముఖ ఓడరేవు పట్టణం అని నిర్ధారించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాటికి కావ్యాలు, పుస్తకాలు, బోధనలలో వాడుకలో ఉన్న గ్రాంథికభాష స్ధానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టడానికి పెద్ద ఉద్యమమే నడిపారు.
గిడుగు నడిపిన వ్యవహారిక భాషోద్యమంవల్ల గ్రాంథికభాషకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని గ్రాంధికవాదులు ఆందోళనపడి కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపించారు. దీని పేరుతో ఒక మాసపత్రికను కూడా నడిపారు. అక్కడతో ఆగకుండా ఆరు సంపుటాలతో సూర్యరాయాంధ్ర నిఘంటువును ప్రచురించారు. గ్రాంధిక భాషావాదులకు పోటీగా వ్యవహారిక భాషావాదులు కూడా ఒక పత్రిక అవసరమని గిడుగు భావించారు. అయితే గ్రాంధిక భాషావాదులకు ఉన్న అంగబలం, అర్ధబలం తమకు లేకపోయింది. అయినప్పటికీ 1919లో తెలుగు అనే మాసపత్రికను పర్లాకిమిడి నుంచే ప్రారంభించారు. అది ఏడాది పాటే కొనసాగినప్పటికీ వ్యవహరిక భాషాద్యోమానికి ఒక ఊతకర్రలా నిలిచింది.
వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరణ ఇచ్చినది 1907లో వై.ఎ. ఏట్స్‌ అనే ఆంగ్లేయుడు. ఈయన ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆయనకు ఏమాత్రం అర్థం కాలేదు. ప్రజలు వాడుకలో వ్యవహరిస్తున్న భాష ఒకలా, పుస్తకాల్లో ఉన్న భాష మరొకలా ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని ఆయన విశాఖపట్నంలోని ఎవిఎన్‌ కాలేజ్‌ ప్రిన్పిపాల్‌గా ఉన్న పి.టి.శ్రీనివాస అయ్యంగార్‌ని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ తన కన్నా ఈ సమస్యపై గిడుగు, గురజాడ సరైన పరిష్కారం చూపగలరని చెప్పారు. ఇలా వ్యవహరిక భాషోద్యమానికి ఒక అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందే 1897లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకానికి ముందుమాట రాస్తూ- వ్యవహార భాషలో సృజనాత్మకత రచనలు రావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే గురజాడకు సన్నిహిత మిత్రుడైన గిడుగు వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంబించడంతో గురజాడ ఆకాంక్షలు కొంతవరకు నెరవేరాయి. ఈ నేపధ్యంలో విజయనగరంలో ఆంధ్ర సాహిత్య సంఘం ఏర్పడింది. ఉత్తర కోస్తా జిల్లాల స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌ జె.ఎ.ఏట్స్‌ ప్రతి ఏటా ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి బోధనా పద్ధతుల గురించి పెద్దలతో ఉపన్యాసాలు ఇప్పించేవారు. అలా జరిగిన వార్షిక సమావేశాల్లో 1907 నుంచి 1910 వరకు గిడుగు రామ్మూర్తి పాల్గొని వాడుకభాష గొప్పతనాన్ని వివరిస్తూ, పాఠశాలల్లో విద్యార్థులకు బోధనాభాషగా శిష్ట వ్యవహారికమే ఎందుకుండాలో ఉదాహరణలతో సహా వివరించారు. 1913లో రాజమండ్రిలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్‌ సమావేశంలో గురజాడ అప్పారావు వాడుక భాషలోనే రచనలు చేసి తన 'ముత్యాలసరాలు' వినిపించారు. అంతకుముందు 1911 సెప్టెంబర్‌ 8వ తేదిన బ్రిటీష్‌ ప్రభుత్వం విద్యార్థులకు ఏ భాషాశైలి ఉపయోగమో నిర్ణయించడానికి పండితులతో ఒక సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో గ్రాంధికభాషావాదులైన జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రిలతో పాటు వ్యవహారిక భాషోద్యమకర్త అయిన గిడుగు రామ్మూర్తి కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం అనేక సమావేశాలు జరిపి వాడుకలో ఉన్న పదాలను, క్రియారూపాలను, సమాసాలను, విభక్తి రూపాలను విద్యార్ధులు వ్యాసరచనలో ఉపయోగించవచ్చని తన నివేదికలో పేర్కొంది. దీంతో వ్యవహారిక భాషావాదులు కొంతవరకు విజయం సాధించారు. అయితే గ్రాంధిక భాషావాదులు తమ మొండిపట్టు వీడలేదు. దేశంలోని ధనికులు, రాజకీయ పలుకుబడి కలిగినవారు గ్రాంధికభాషవైపే మొగ్గు చూపడంవల్ల గతంలో వ్యవహారిక భాష వాడటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇచ్చిన జివోను 1914లో ఉపసంహరించుకుంది. విద్యాశాఖ మరో జీవోను గ్రాంధిక భాషావాదులకు అనుకూలంగా జారీ చేసింది. అయినప్పటికీ తన పోరాటంలో గిడుగురామ్మూర్తి వెనకంజ వేయలేదు.
గ్రాంధిక భాషావాదులచేత వచన రచనకు వ్యవహారిక భాష వాడడం సముచితమని ఒప్పించడానికి గిడుగు రామ్మూర్తి రెండు విధాలైన ఉపపత్తులను సేకరించారు. అందులో ఒకటి పూర్వకాలాల్లోని కావ్యాలలో తప్ప ఆనాటి కవులు, పండితులు శాసనాలు, టీకాలు వ్యాఖ్యానాలు వంటి వాటిలో వ్యవహారిక భాషనే వాడారని నిరూపించారు. దీనికోసం ఆయన ఎన్నెన్నో తాళపత్ర గ్రంధాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు. వాటినే బాలకవి శరణ్యం, గద్యచింతామణి వంటి గ్రంథాల్లో ప్రచురించారు. రెండవది పరవస్తు చిన్నయసూరి వ్యాకరణానికి అనుగుణంగా రచనలు చేస్తున్నామని చెప్పుకొనే పండితులు ఎన్నెన్ని విరుద్ధమైన ప్రయోగాలు చేస్తున్నది గిడుగు రామ్మూర్తి ఎత్తి చూపించారు. ఆనాటి పండితులు, కవుల రచనల్లోని వ్యాకరణదోషాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇలా తాను సేకరించిన సాక్ష్యాధారాలను తనవెంట తీసుకొని ఆంధ్రరాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలు సందర్శించి, విద్యాలయాల్లో పండితులను కలుసుకుని వారితో వ్యవహారిక భాష ఆవశ్యకతపై సభలూ సమావేశాలు నిర్వహించేవారు. వీటి వివరాలన్ని తాను నడిపిన తెలుగు పత్రికలో ప్రచురించేవారు.
ఆ క్రమంలోనే గిడుగు రామ్మూర్తికి కందుకూరి వీరేశలింగం పంతులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1919 ఫిబ్రవరి 28వ తేదిన రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షునిగాను, గిడుగు రామ్మూర్తి, జయంతి గంగన్నలు కార్యదర్శులుగాను 'వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం' ఏర్పడింది. కందుకూరి ప్రభావంతో వితంతు వివాహాలను కూడా జరిపించి సంఘసంస్కరణోద్యమానికి తన వంతు కృషి జరిపారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఒక 'నవ్యాంధ్ర వ్యాకరణం', 'నవ్యాంధ్ర నిఘంటువు' రాయడానికి అవసరమైన సమాచారమంతా సేకరించి పెట్టుకున్నప్పటికీ నిరంతరం వాదోపవాదాలతో కాలం గడపడం వల్ల గిడుగు రామ్మూర్తి ఆ మహాకార్యాలు నిర్వర్తించడానికి వీలు కుదరలేదు. కందుకూరి వీరేశలింగం 'నవ్యాంధ్ర వ్యాకరణం' పేరుతో ఒక విపులమైన వ్యాకరణం రాయడానికి పూనుకోగా గిడుగు రామ్మూర్తి తాను సేకరించిన సమాచారాన్నంతటిని ఆయనకు ఇచ్చారు. అయితే ఇది జరిగిన కొద్దిరోజులకే వీరేశలింగం మృతి చెందడంతో ఆ వ్యాకరణం వెలుగు చూడలేదు. వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు రామ్మూర్తికి పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, చళ్లపిళ్ల వెంకటశాస్త్రి, తాపీ ధర్మారావు, పురిపండా అప్పలస్వామి తదితరులంతా చేదోడువాదుడుగా నిలిచారు. 1933లో గిడుగు రామ్మూర్తి సప్తతి మహౌత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేందవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో 'వ్యాస సంగ్రహం' అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. 1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్తు అధికారికంగా వ్యవహారికభాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే ప్రతిభ అనే సాహిత్య పత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా 'జనవాణి' అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర - ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవర భాషాకృషికి మెచ్చి కైజిర్‌ -ఇ-హింద్‌ పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు. గిడుగు రామ్మూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామత కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుది విన్నపంలో వ్యవహారిక భాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కానీ, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరి మాటలు- 'దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజన వ్యవహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంధికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదువవద్దనీ, విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కానీ ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను.' అని అన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటులో తాను అభిమానించిన పర్లాకిమిడి జమిందారు, బ్రిటీష్‌ ప్రభుత్వం తెలుగు వారికి అన్యాయం చేయడంతో ఆయన నిర్వేదంతో పర్లాకిమిడిని విడిచిపెట్టి వచ్చేశారు. తెలుగు భాషకు వ్యవహారిక జిలుగులద్దిన మానవతామూర్తి గిడుగు వెంకట రామమూర్తి 1940 జనవరి 22వ తేదీన కాలధర్మం చెందారు.
వ్యవహారిక భాషను ప్రతిష్టించడంలో విశ్వవిద్యాయాలు, ప్రభుత్వం వెనకంజ వేసినప్పటికీ పత్రికలు మాత్రం గిడుగు రామ్మూర్తి వాదానికి ఎంతో బలాన్ని చేకూర్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1969లో తెలుగు అకాడమీని స్ధాపించింది. 1969లో పిహెచ్‌డి విద్యార్థులు తమ పరిశోధనా వ్యాసాలను వ్యవహారికంలో రాయడానికి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుమతించింది. 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా వ్యవహారిక భాషనే ఆమోదించింది. 1911లో గిడుగు రామ్మూర్తి ప్రారంభించిన వ్యవహారిక భాషోద్యమం 1973 నాటికి విజయవంతమైంది.
(ఈనెల 29 గిడుగు వెంకట రామమూర్తి 150వ జయంతి)
                                                                                           - బెందాళం క్రిష్ణారావు,
                                                                                                         9493043888

9, జులై 2013, మంగళవారం

ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు
ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న దీపావళి పర్వదినాన బెంగళూరులో జన్మించారు. భారతదేశం గర్వించదగిన ఒక గొప్ప వయొలిన్‌ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941లో ఇతనికి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. ద్వారం బెంగళూరులో జన్మించినా... పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం ‘మహారాజా సంగీత కళాశాల’లో వయొలిన్‌ ఆచార్యునిగా నియమితుడయ్యారు.

DWARAM11936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. వయొలిన్‌ వాయిద్యంతో ఒంటరి కచేరీలు ఇవ్వడం ఈయనతోనే ఆరంభం కావడం విశేషం. కాగా మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో గొప్పగా ‘ద్వారం’ కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్‌ కళాకారుడు యెహుదీ మెనుహిన్‌ ద్వారం వారి వయొలీన్‌ సంగీతాన్ని జస్టిస్‌ పి.వి.రాజమన్నార్‌ ఇంటిలో విని ఎంతగానో ప్రశంసించారు.ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి.

కర్ణాటక సంగీతాన్ని సైతం వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ద్వారం నాయుడే అంటారు అంతా.... సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశారు.. ‘తంబూరా విశిష్ట లక్షణాలు’ అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం వివిపించే తపస్సు అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఆయన తన శిష్యులకు చెప్పేవారు. ‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి’’ అని ద్వారం చెప్పే సూచనలను ఆయన శిష్యుపరమాణువులు తూ.చ.పాటించేవారు. చెన్నై మహానగరంలో ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు, విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.

ప్రపంచానికే ముద్దుపేరు
సంగీత కళాజగతికి ముద్దు పేరు ‘ద్వారం’. సంగీత కచేరీ వేదికపైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్‌ లేక ఫిడేల్‌) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని ‘మెలోడీ ఫీస్ట్‌’ గా మార్చడానికి కంకణం కట్టుకుని, కృషిసల్పిన ఘనత కేవలం ద్వారంనాయుడి గారి కళాజీవన ప్రస్థానంలో మరువలేని, ఎన్నటికీ మార్చలేని మైలురాళ్ళు. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న బెంగుళూరులో దీపావళి రోజున జన్మించడంతో సంగీత జగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి.

dwaram-uksతండ్రి వెంకటరాయుడు, ఆర్మీలో కమిషన్‌ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నానికి వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వయొలిన్‌ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడా ఈ వయొలిన్‌ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయంగా చేసుకున్న వెంకటస్వామినాయుడు తన అన్న వెంకటకృష్ణయ్య, తాత దగ్గర వయొలిన్‌ నేర్చుకుంటున్న సమయంలో, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు కూడ అన్నగారి వయొలిన్‌ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతంపై దృష్టి మరల్చవలసి వచ్చింది.

ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్ర్తి
గారి వద్ద నాయుడుగారు వయొలిన్‌ వాదనలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. నాయుడుగారు 14వ ఏటనుంచే వయొలిన్‌తో తదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచందర్రావు ద్వారం వయొలిన్‌ ప్రతిభను గమనించి, డైమండ్‌ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారికి ‘ఫిడేల్‌ నాయుడు’ అని బిరుదుని యిచ్చారట. వయొలిన్‌నే ఫిడేల్‌ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్‌ అంటే ‘ఫిడులా’ అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్‌ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్‌, ఆంధ్రదేశపు సంగీత జగతితో మమేకమయింది.

వయొలిన్‌ పుట్టు పూర్వోత్తరాలు
Dwaram_Venkataswaసంగీత వాద్య పరికరమేఅయినా కొత్తగా అనిపించే వయొలిన్‌ 17వ శతాబ్దం మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, ‘వడివేలు అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వయొలిన్‌పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు(1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వయొలిన్‌ని తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం.

తర్వాత, 19వ శతాబ్దం ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో వయొలిన్‌తో సంపూర్ణంగా ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్‌ కృష్ణ అయ్యర్‌, గోవిందస్వామి పిళ్ళైలు రంగప్రవ్రేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కథనాలు. వీణ, వేణువు, నాదస్వరంతో వయొలిన్‌ను చేర్చిన ఘనత మాత్రం ద్వారం వెంకటస్వామినాయుడికే దక్కుతుంది. వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరాల ఘనమైన వరసలో వయొలిన్‌ను నిలబెట్టిన ఘనత మాత్రం మన ‘ఫిడేల్‌ ద్వారం నాయుడే’ అన్నది మాత్రం సత్యం. వీటికి వయొలిన్‌ లేక వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడా నిరూపించిన నిష్ణాత విద్వాంసుడు ద్వారం నాయుడు.

ప్రముఖుల ప్రశంసలు
పాశ్చాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వయొలిన్‌ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణ స్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేస్తున్నట్లుగా చిత్రీకరించిన చిత్రం విశ్వవ్యాప్తంగా ఆయన అభిమానులను ఆశ్చర్యానందభరితుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. అలాగే ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలు గుప్పించడం కూడా జరిగింది.
ద్వారం నాయుడుగారి వయొలిన్‌ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీందన్రాధ్‌ ఠాగూర్‌, అన్ని ముఖ్య కార్యక్రమాలను అనుకున్నవి మరచి పోరుు పూర్తి కచేరి వినడమే కాక, నాయుడు గారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోరుుంది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌కు సంబంధించిన గ్రామఫోన్‌ రికార్డ్‌, పక్కనే ఆయనపేరిట విడుదల చేసిన పోస్టల్‌ స్టాంప్‌.

మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ - సంగీత కళానిధి అవార్డు - 1941, సంగీత నాటక అకాడమీ - 1953, పద్మశ్రీ అవార్డు - 1957, భారతీయ తపాలా శాఖవారు 1993 లో ఆతని శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు. రాజా లక్ష్మీ అవార్డు - 1992లో - శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్‌ వారిచే, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టుకు బహూకరింపబడింది.

స్వాతి సోమనాథ్‌

సుమధుర స్వాతి నృత్యం
స్వాతి సోమనాథ్‌ ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి. ఎంత సంప్రదాయబద్ధంగా నర్తిస్తుందో అంతకన్నా ఆధునిక భావాలు కలిగిన మహిళ ఆమె. తాను రూపొందించే నృత్యరీతుల్లోనే కాదు, భావాలలోనూ ఆదర్శనీయంగా ఉంటారామె. వ్యక్తిగతంగా ఆమెకు ఎంతగా పేరుప్రఖ్యాతులు వచ్చాయో అంతకన్నా వివాదాలు మరింతగా ఆమెను చుట్టుకున్నారుు. ఆమె చేసే ప్రతి పని లోనూ ఒక సత్సంకల్పం ఉంటుంది. అందులో భగవత్కటాక్షం ఉంటుందని ఆమె నమ్ముతారు.

ప్రొఫైల్‌...
Untia
పూర్తిపేరు  : స్వాతి సోమనాథ్‌
జన్మస్థలం  : జార్ఖండ్‌
భర్త  : సి.హెచ్‌.రవి కుమార్‌   
           (దర్శకుడు)
వృత్తి    : కూచిపూడి  
                నృత్యకళాకారిణి
ప్రఖ్యాతి   : కామసూత్ర నృత్య 
                ప్రదర్శన
బిరుదు   : కళా రత్న

Un2స్వాతి సోమనాథ్‌ అంటే ఆమె నాన్నగారి పేరు కూడా ఆమెతో ఇమిడివుంటుంది. పుట్టింది బీహార్‌...పెరిగింది పశ్చిమబెంగాల్‌లో...స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌ మహానగరంలో. స్వాతి పూర్వికుల స్వస్థలం శ్రీకాకుళం దూసి అగ్రహారం. వారిది సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. స్వాతి తండ్రి సోమనాథ్‌కి సంగీత సాహిత్యాలంటే ఎనలేని అభిమానం. అంతేస్థాయిలో జర్నలిజాన్ని కూడా ప్రోత్సహించేవారు. వృత్తిరీత్యా రైల్వే శాఖలో చేసేవారు. నృత్యప్రదర్శనలు ఏవీ వదిలేవారు కారు. కొన్నిసార్లు ప్రత్యేకంగా స్వాతిని కూడా నృత్యప్రదర్శనలకు తీసుకెళ్లేవారు. చిన్నవయసులో ఊహతెలిసి స్వాతి చూసిన ప్రదర్శన యామినీ కృష్ణమూర్తి ప్రదర్శన. ఆ తర్వాత ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నృత్యభంగిమలు ప్రాక్టీసు చేసేవారు స్వాతి.

ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రముఖ నృత్యకారిణి సుమతీ కౌశల్‌ వద్ద చేర్చారు.వ్యక్తిగతంగా స్వాతి సోమనాథ్‌ ఇచ్చిన కామసూత్ర నృత్యప్రదర్శనకు దేశవిదేశాలనుంచి ఎంతగానో ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో కొంత చెడు ప్రచారం కూడా జరిగింది. అది కేవలం కామసూత్ర అన్న పేరుతో ఆ నృత్యాన్ని ముడిపెట్టడమే అందుకు కారణం.
పేరుతెచ్చిన కామసూత్ర ప్రదర్శన..

Unawకామసూత్ర నృత్యానికి ఆమెకు మంచిపేరే వచ్చినా... సంప్రదాయనృత్యంగానే ఆమె భావించారు. ఆ నృత్యం చేసినందుకు స్వాతి తనని తాను ఏనాడూ విమర్శించుకోలేదు. అది కేవలం కొందరు పనిగట్టుకుని విషం చిమ్మారే తప్ప తన నృత్య భంగిమ లలో ఎటువంటి అసభ్యత కానరాదంటారు స్వాతి. శృంగారరసం లేని సాహిత్యమే లేదు. దాన్ని పక్కన పెట్టి మనమేమీ చేయలేం. సర్వజ్ఞశంకరలో సరస్వతీదేవి వచ్చి ఆది శంకరాచార్యు లను కామశాస్త్రం గురించి అడిగితే ఆయన ఆగిపోతారు. బదులేమీ చెప్పలేక పరకాయ ప్రవేశం చేసి, ఎంజాయ్‌ చేసి మళ్లీ వచ్చి సమాధానం చెబుతారు. కాబట్టి కామం, శృంగారం లేని కళ లేదు అంటారామె. భారతదేశం కళలకు పుట్టినిల్లు.యావత్‌ ప్రపంచానికి ఈ విషయాన్ని కొన్ని తరాలుగా మన కళాకారులు చాటుతున్నారు.

మన దేశంలో ప్రాంతాల వారిగా అనేక నృత్య కళలు ఉన్నాయి. వాటిని భావితరాలకు అందించే బాధ్యతను మనందరం గుర్తించాలి. నేటి తరం పిల్లలకు శాస్ర్తీయ నృత్యంలో ప్రావీణ్యం పొందేలా తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహించాలని కోరారు.నృత్యకళను అభ్యసించిన విద్యార్థులు చదువుల్లోనూ రాణించగలరని పరిశోధనల్లో నిరూపితం అయ్యిందని తెలిపారు.పాశ్చాత్య నృత్యాలు కేవలం శారీరక భంగిమలపై కేంద్రీకృతమై ఉంటాయని.. భారతీయయ శాస్ర్తీయ నృత్యాలు శారీరక భంగిమలతో పాటు, ప్రేక్షకులతో మానసికంగా బంధాన్ని పెనవేసుకుంటా యని తెలిపారు.

వ్యక్తి గత జీవితం..
చిన్నప్పటినుంచే కళా ప్రదర్శనలు ఇచ్చేవారు ఆమె. ఆమె అందం చూసిన కొందరు నిర్మాతలు సినిమాలలోకి రావలసిందిగా ఆఫర్‌ ఇచ్చారు. కానీ సినిమాలపై ఆసక్తి లేక వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. స్వాతి భర్త ప్రముఖ సినిమా దర్శకుడు. సిహెచ్‌.రవికుమార్‌. సామాన్యుడు, విక్టరీ చిత్రాలు తీశారాయన. దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా భార్య కోరికమేరకు ఆమెను పెళ్లి తరువాత స్వాతీ రవికుమార్‌గా పేరు మార్చుకుంటానంటే.. అందరికీ తెలిసిన స్వాతీ సోమనాథ్‌గానే కంటిన్యూ చేయమన్నారు.

కేవలం శాస్త్ర సంగీత అంశాలేకాకుండా ఒక గృహిణిగానూ ఆమె సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆడవారు అన్ని రంగాలలో సమానంగా ఉండాలంటారు. నేటి మహిళలు రాజకీయాలలో కూడా రాణించాలని అవకాశం దొరికితే ఎటువంటి పదవిని అలంకరించడానికైనా వెనకడుగు వేయకూడదంటారు ఆమె. ఆమె చిన్నప్పటినుంచి కూడా చాలా కష్టపడి పైకొచ్చారు. తన పూర్వికుల స్వస్థలమైన శ్రీకాకుళంలో సంగీత,నృత్య కళాశాలను ప్రారంభించాలనేది ఆమె జీవిత సంకల్పం.

పౌరాణికాలంటే స్వాతికి చిన్నతనంనుంచి ఓ ప్రత్యేక అభిమానం. దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన స్వాతిసోమనాధ్‌ విద్యార్థులకు తన ఆశయాలతో స్థాపించిన ఓ స్కూల్లో శిక్షణనిస్తున్నారు. తాను క్లాసికల్‌ డాన్సర్‌గా ఈ రంగంలోకి కేవలం డబ్బు, కీర్తిప్రతిష్టలు సంపాదించడానికి మాత్రం రాలేదంటారు. అలా సంపాదించాలనుకుంటే ఈ పాటికి కోట్లే సంపాదించేదానిని కానీ ఫీజులే లేకుండా అత్యుత్సాహం ఉన్నవారికి తనవంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందంటారామె.

బారువా

గ్రామమే ఓ ఆలయం... బారువా
 
 
 
ఆ ఊళ్లో మీరు ఏ వీధికి వెళ్లినా ఓ దేవాలయం దర్శనమిస్తుంది. వీటికి తోడు సముద్ర తీరం, అం దమైన ప్రకృతి శోభలతో ఈ గ్రామం కళకళలాడుతుంటూంది. ఆ గ్రామం పేరే బారువా శ్రీకాకుళంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో ఆలయాలలో ప్రసిద్ది చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధ నస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది.


బారువ సముద్రతీరం... 

ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్ర తీరంలో నిలుచుని చూడటం మరుపురాని మహాద్భుతం. మహాభారతం, స్కంధపురాణం వంటి ధార్మిక గ్రంధాలలో బారువ తీరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరమహోదయానికి ఈ స్థలం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. చివరిసారిగా ఆ శుభదిన 07 ఫిబ్రవరి 2008 నాడు వచ్చింది. ఆ సమయంలో మహోదయ పుష్కర స్నానాలు బారువ తీరం కిటకిటలాడు తుంది. తూర్పుకనుమల నుంచి మొదలై ఒరిస్సా, ఆంధ్రా రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ, బంగాళాఖాతములో కలుస్తున్న పవిత్ర మహేంద్ర తనయ నదీ సంగమ స్థలమే ఈ బారువ గ్రామం. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడకు వస్తారు. మాఘమాసం, శ్రవణ నక్షత్రం గురువారం ఉదయం 6.39 నిముషాలకు పుష్కర శుభఘడియలు ప్రారంభమవుతాయి.


చారిత్రక నేపథ్యం...
స్కంధపురాణం ఆధారంగా పలువురు సిద్ధాంతుల ప్రకారం... సుమారు 16 వేల సంవత్సరాల క్రితం తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని వేటాడే ప్రయత్నములో విడిచిన బాణం సుదూరంలో వున్న ఒక గోవును తాకగా గోవు చనిపోయినది. గొహత్యా మహా పాపమని భావించి పాపవిమోచన కోసం ఆలోచించారు పాండవులు. ఈ నేపథ్యంలో మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవుని సముద్రతీరానికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలని సలహా ఇవ్వడంతో ఆ గోవును సముద్ర తీరానికి తరలించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం అక్కడే వున్న పావన మహేంద్ర తనయ నదీ-సాగర సంగమ స్థలంలో పాండవులు స్నానాలు ఆచరించి, మోక్షం పొందేరని చారిత్రక కథనం.

Baru5పాండవులు సంగమ స్నానం చేసిన అనంతరం సమీపాన వున్న గ్రామానికి వెళ్లి అక్కడ 12 మంది బ్రాహ్మణుల సమక్షంలో యజ్ఞోపవీతం చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాన్ని ‘బారాహరాపురం’ గా పిలిచేవారు, కాలక్రమేణా అది బారువగా మారినది. బారువ గ్రామం పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమ భాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కథనం. అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు.

దీనికి దక్షిణ వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయం, ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపా లస్వామి ఆలయం, మహంకాళీ, కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడం సంప్రదాయంగా వస్తూ ఉంది.

జగన్నాథ ఆలయం

జగన్నాథ రథయాత్ర
ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో తీర పట్టణమైన పూరిలో ఉంది. జగన్నాథ్‌ అంటే విశ్వానికి దేవుడు అని అర్థం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వారికి ఇది అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందూ తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ఛార్‌ థాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర జనం లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. వైష్ణవులకు, రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు.

శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. స్నాన యాత్రా సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు. రోజూవారి ఆరాధన సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమయినది జూన్‌లో జరిగే రథయాత్ర ఉత్సవం. పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది.

ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు పత్రిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. విచిత్రం ఏమిటంటే రథయాత్ర ప్రారంభం అయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైన స్వామి వారికి సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఇది ఆచరిస్తున్నారు.

ఆకట్టుకునే రథాలు
రథయాతల్రో జగన్నాధుని రథాన్ని ‘నందిఘోష్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి అతి పెద్దవైన పదహారు చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథాన్ని ‘తాళ్‌ధ్వజ్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని ‘దర్ప దళన’ అనే పేరుతో వ్యవహరిస్తారు.గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉన్న జగన్నాథుడు, ఆయన పెద్దసోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వంతో దేవేరుల విగ్రహాలను దర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన శైలిలో మూడు రథాలు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటాయి. రథం కదిలే సమయంలో శంఖాలను, గంటను మోగిస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడడమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలుగా చెబుతారు.

ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు.

మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొం తమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధు ని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావ తారల్లోని కృష్ణుని ఆవతారానికి మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాల న్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయాన్ని చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్‌ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.

వెళ్లడం ఇలా
మన రాష్ట్రం నుండి బయలుదేరి వెళ్లే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సె ప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్లు కలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్‌ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా ఉన్నాయి.

ఆలయ నిర్మాణ విశేషాలు
ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ల దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.

ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్‌గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు. బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరులో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్‌ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు.

శాలిహుండం

శాలిహుండం
ఆంధ్రదేశంలో ఉన్న సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి శాలి హుండం. శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో... వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేస్తూ ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టే పర్యాటక స్థలం, అందమైన క్షేత్రం శాలిహుండం. పూర్వం శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారం) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు.
శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగ పట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.
శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఎ.హెచ్‌.లాంగ్‌హర్ట్‌‌స, టి.ఎన్‌.రామచంద్రన్‌, ఆర్‌.సుబ్రహ్మణ్యన్‌ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహం, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీపూ 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.

11, మే 2013, శనివారం

తాపీ ధర్మారావు

తాతాజీ ఒరవడి
తాపీ ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందిరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు.

tapi-dharmaraoతాపీ ధర్మారావు ఆంధ్ర సాహితీ రంగంలో అద్వితీయమైన కృషి చేసిన మహనీయుడు. ఆయన గ్రాంథిక భాషావాదిగా కావ్య రచన చేశాడు. తరువాత వ్యావహారిక భాషావాదిగా మారి పత్రికా రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆయన మొట్టమొదట పత్రికారంగంలో ప్రవేశించింది ‘సమ దర్శిని’ సంపాదకుడుగా. అది జస్టిస్‌ పార్టీ పత్రిక. ‘సమ దర్శిని’ ప్రచురణ కర్త పింజల సుబ్రహ్మణ్య శెట్టి. ఆయన తెలుగు ప్రాంతంనుంచి తమిళప్రాంతానికి వెళ్ళి స్థిరపడిన తెలుగు ప్రముఖులు. ‘సమ దర్శిని’ జస్టిస్‌ పార్టీ భావజాలంతో ఆనాటి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ప్రోత్సహించేది. ధర్మారావుకి ఆ పత్రికతో సంబంధం ఏర్పడేనాటికే ఆయన రచయితగా ప్రసిద్ధి పొందాడు. పత్రిక వల్ల గూడవల్లి రామబ్రహ్మం, మరుజీవి కోదండ రామిరెడ్డి వంటివారు ధర్మారావు సన్నిహితులయ్యారు. అనేక విషయాలమీద ఆ పత్రికలో రచనలు వస్తూ ఉండేవి. అయితే భాష సరళ గ్రాంథికంలో ఉండేది.

‘సమ దర్శిని’ నుంచి ధర్మారావు ‘ప్రజామిత్ర’కు మారడం జరిగింది. ఆ మార్పు సాదా సీదా మార్పు కాదు. భాషాపరంగా గుణాత్మకమైన మార్పు. గ్రాంథిక భాషావాదిగా ఉన్న ఆయన వ్యావహారిక భాషావాదిగా మారి తెలుగు జర్నలిజానికి నూతన దిశానిర్దేశం చేసిన మార్పు. ప్రజామిత్ర సారథి గూడవల్లి రామబ్రహ్మం. ధర్మారావుకీ ఆయనకీ సమదర్శిని నాటినుంచే ఆత్మీయ బంధం ఏర్పడింది. రామబ్రహ్మం ధర్మారావును గురూజీ అనే పిలిచేవారు. ప్రజామిత్రతో ఎందరో ప్రముఖులకు సంబంధం ఉండేది. సముద్రాల రాఘవాచార్య, నార్ల, శ్రీనివాస్‌ శిరోమణి, ఆండ్ర శేషగిరిరావు, బోయి భీమన్న లాంటి వాళ్ళంతా ఆ కార్యాలయంలో చర్చలు సాగిస్తూ ఉండేవారు. వాటిని వ్యాసాలుగా ప్రజామిత్ర ప్రచురించేది. చలం లాంటి వచన రచయితలు సాహిత్య రంగంలో దుమారం లేపుతూ ఉండేవారు.

వావహారిక భాషా ప్రియత్వం ఎంతటిదో విశదమవుతూ ఉండేది. ఆ ప్రభావంతోనే ధర్మారావు గ్రాంథికం నుంచి వ్యావహారానికి మారి రచనలు చెయ్యడానికి ప్రజామిత్ర మార్గం సుగమం చేసింది. ఈనాటికీ ధర్మారావు పేరుకు పర్యాయంగా నిలిచే ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’ వ్యాసాలు ప్రజామిత్రలో వచ్చినవే. అలాగే ‘కొత్త పాళీ’ వ్యాసాలను ప్రజామిత్ర ధారావాహికంగా ప్రచురించింది. ప్రజామిత్ర తరువాత ధర్మారావు సంపాదకత్వం వహించిన పత్రిక ‘జన వాణి’. రాజకీయ కారణాల వల్ల పిఠాపురం రాజా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో దినపత్రిక స్థాపించారు. తెలుగు పత్రికకు జనవాణి అని పేరు పెట్టారు. ధర్మారావు సంపాదకత్వంలో నడిచిన ఆ పత్రికలో నార్ల, పి. శ్రీరాములు, పండితారాధ్యుల నాగేశ్వరరావు వంటివారు ఉప సంపాదకులుగా పని చేశారు.

ఈ ప్రముఖులందరూ తరువాత కాలంలో ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి లాంటి పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. జనవాణి వెలువడేనాటికి ఆంధ్రపత్రిక ఒక్కటే దిన పత్రిక. ఆ పత్రికలో భాష గ్రాంథికం. ఆ పత్రికలో రెండు కాలమ్‌ల శీర్షికలు గాని, బానర్‌ గాని ఉండేవి కావు. ఒకప్పుడు హిందూ పత్రిక ఆంగ్లంలో ఉన్నట్టుగా మొదటి పేజీ నిండా వ్యాపార ప్రకటనలే ఉండేవి. అలాంటి నేపథ్యంలో ధర్మారావు వ్యావహారిక భాష లోనే పత్రిక నడపాలని సంకల్పించారు. పత్రిక స్వరూపాన్ని ధర్మారావు మార్చారు. రక రకాల టైపుల్ని ఉపయోగించారు. శీర్షికల్ని రెండు కాలమ్‌లలో, మూడు కాలమ్‌లో పెట్టేవారు. బానర్‌లనీ పెట్టేవారు. వార్తలు కూడా ఇంగ్లీషు నుంచి మక్కికి మక్కీ అనువాదం కాకుండా సొంత మాటల్లో, సొంతంగా వ్రాస్తున్నట్టు ఉండాలని సిబ్బందికి శిక్షణ నిచ్చారు. శీర్షికలు పాఠకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని చెప్పేవారు. ఆ రకంగా పత్రిక ఆకర్షణీయం అయ్యేలా చూసేవారు.

ధర్మారావు పనితీరు కూడా సిబ్బందికి ఒరవడి అయింది. ప్రధాన సంపాదకుని హోదా ప్రదర్శించలేదు. అందిరితో పాటు కలిసి కూర్చునేవారు. అందర్నీ ఆత్మీయంగా బ్రదర్‌ అని పిలిచి ఒక సాన్నిహిత్య వాతావరణాన్ని కల్పించారు. ఆయనే సంపాదకీయాలను, రైటప్‌లను రాస్తూ ఉండేవారు. తన బాణీని ధర్మారావే ఒక సందర్భంలో వివరించారు. ‘తక్కువ పదాలతో వాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారికమనిపిస్తుంది. క్రియా పదాలు వ్యావహారికం చెయ్యడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్‌ కనిపెట్టాను. గ్రాంథిక భాషా వాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది కాదు’. ఈ టెక్నిక్‌ని న్యాపతి నారాయణ రావు కూడా ప్రశంసించారు. ధర్మారావు పస గల భాషావాదవుతున్నా’రని గ్రాంథిక భాషావాది అయిన కట్టమంచి రామలింగారెడ్డి మెచ్చుకున్నారని నార్ల చెప్పారు. ధర్మారావు అలా ఆ తరవాత వచ్చిన తెలుగు పత్రికలన్నింటికీ పథ నిర్దేశకులయారు. ఆంధ్ర పత్రిక కూడా కొత్తమార్గాన్ని అనుసరించక తప్పింది కాదు.

జనవాణి నిర్వహణ భారం కష్టమని తోచి పిఠాపురం రాజా దాన్ని నిలిపివేశారు. ధర్మారావు అప్పటికి జీవితంలో ఒడిదుడుకులు లేకుండానే గడుపుతున్నారు. కాని తన మనసులో వెల్లువెత్తుతున్న భావాల్ని వెల్లడించడానికి పత్రిక లేదు. తను జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కిన మనిషి. దాంతో పత్రిక లేని లోటు స్పష్టంగా కనబడింది. ఎవరి కొలువులోనో నడిచే పత్రిక ఎందుకు అనిపించింది. తనే స్వయంగా ఒక పత్రికను నిర్వహించవచ్చునన్న ఆలోచనా మెదిలింది. అలా ‘కాగడా’ పత్రికకు నాందీ పలకడం జరిగింది. పత్రిక ప్రతి బుధవారం వెలువడేది. ఆయనా, ఆయన పెద్ద కుమారుడు మోహనరావు పత్రికను నిర్వహించేవారు.

devalayalu‘కొత్త జీవకళను ప్రవహింపచేసేందుకు పత్రికా ముఖంగా సాయపడడమూ, సమాజంలోని వివిధ అంశాలనూ, దానిలోని వివిధ పరిణామాలనూ సహేతుకంగా విశదీకరించి ప్రతికా ప్రపంచంలో ఒక కొత్త యుగాన్ని స్థాపించడమూ’ కాగడా ఆశయాలు. ప్రతిక ఆశయాలకు అనుగుణంగానే నడిచింది. ప్రపంచ సంస్కరణలకి ఆసరా అందించేది. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించింది. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని భూతంలా ఆవహించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. కాగడా ప్రపంచ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఉండేది. కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైనా వామపక్ష భావాలవైపు కాగడా మొగ్గు చూపించింది.

సాంఘికంగా, రాజకీయంగా పురోగామి శక్తులకు కాగడా వెన్ను దన్నుగా ఉండేది. అయితే ప్రతికగా అది తన వంతు కృషిని అద్వితీయంగా నిర్వహించింది. ‘కాగడా గాలి విసురు’, ‘పిట్ట చూపు’ లాంటి శీర్షికలతో రాజకీయ ఘటనలపై, నాయకులపై, ప్రభుత్వ అధికారులపై విమర్శనాత్మక వ్యాఖ్యల్ని సంధించేది. ధర్మారావు అంతకు ముందు పాలు పంచుకున్న పత్రికలలోనూ కలం పేరుతో రచనలు చేశారు. కాగడాలో ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ‘తడాకా’ అనే కలం పేరుతో శీర్షికను నిర్వహించేవారు. సిహత్య కృషీ ఆ కోవలోనే సాగేది. ‘పరాక్‌’ అనే శీర్షికన ప్రాచీన సాహిత్యం గురించి పాఠకుల్లో అభిరుచి కలిగించారు. అలాగే యేదో పేరుతో ఒక చర్చను లేవనెత్తేవారు. ఆ చర్చలు సంచలనం కలిగించేవి. విషయ విశ్లేషణకీ, వాదనకీ అవి ఆధారమయేవి. ‘సత్యవతి’ పేరుతో ప్రేమ వివాహాల మీద ధర్మారావు నిర్వహించిన చర్చ అలంటిదే.

‘పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు’, ‘ఇనుప కచ్చడాలు’ వ్యాసాలు ఆ పత్రికలోనే వచ్చాయి. ‘పద్య భిక్ష’ పేరు మీద ప్రాచీన కవిత్వం మీద ఆసక్తి కలిగించారు. పత్రికారంగంలో కృషి చేసి జర్నలిజానికి ధర్మారావు పెద్ద పీట వేశారు. సినిమా రంగంలో ఎన్నో సినిమాలకి మాటలు, పాటలు రాశారు. సాహిత్య రంగంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు, విమర్శలూ రాశారు. ఇవన్నీ ఆయన పరిశోధనా పాటవాన్నీ, ప్రతిభనీ ప్రతిబింబించాయి. ఆయన అంతటితోనే ఆగక ప్రచురణ సంస్థలు స్థాపించారు. మొదటగా స్థాపించిన ప్రచురణ సంస్థ ‘వేగుచుక్క’ గ్రంథమాల. అప్పటికి ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’ స్థాపన జరిగింది. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి 1906లో ఆవిర్భవించింది. కొమర్రాజు లక్షణరావు సంపాదకులు.

సంవత్సరానికి నాలుగు పుస్తకాలు తీసుకురావాలన్నది లక్ష్యం. ఆ సంస్థను దృష్టిలో ఉంచుకునే ధర్మారావు 1911లో ‘వేగుచుక్క’ గ్రంథమాలకు శ్రీకారం చుట్టారు. విజ్ఞానచంద్రికవారి పరిధిలోకి రాని ప్రక్రియలను ప్రచురించాలని భావించారు. అప్పటికి ధర్మారావు గ్రాంథిక భాషావాది. అంచేత ప్రచురణలు ఆ మూసలోనే ఉండేవి. గ్రాంథిక భాషని సమర్ధిస్తూ ‘ఆంధ్రులకొక విన్నపం’ అని ఒక ప్రకటన దానిద్వారానే ప్రచురితమైంది. ఆయన ‘పాతపాళీ’ రచనలన్నీ ఆ సంస్థ ద్వారానే వెలుగు చూశాయి. ఆ తరువాత పత్రికలలో పని చెయ్యడం, పత్రికలని నిర్వహించడం వల్ల స్వంత ప్రచురణ సంస్థల ఆలోచన వచ్చినట్టు లేదు. ఆయన వచన రచనలన్నీ పత్రికల కోసం రాశారు.

అవి అచ్చులో అలా అందరికీ దర్శనమిచ్చినవే. అయితే చెదురు మదురుగా ఉన్న రచనల్ని ఒక గ్రంథరూపంలో ప్రచురిస్తే నాలుగు కాలాలపాటు నిలబడతాయి. అందరికీ అందుబాటులోకి వస్తాయి. లేనట్లయితే ఎంతటి సంచలనాత్మక రచన అయినా అది ముద్రణకు నోచుకున్న పత్రికతో పాటే తెరమరుగు అయిపోతుంది. వార్తాపత్రికల మనుగడ కొన్ని గంటలు వూత్రమే. పక్ష మాస పత్రికల ఆయుష్షూ అంతే. ‘బుక్స్‌ ఆఫ్‌ది అవర్‌, బుక్స్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ని రస్కిన్‌ అన్న మాటలు మనసులో పెట్టుకోవాలి. వాటి గుణాల్ని బట్టి ఇలాంటి వర్గీకరణ ఉంటుంది.

అందుచేత గ్రంథ ప్రచురణ రచనల జీవిత కాలాన్ని పెంచుతుంది. గ్రంథరూపంలో రాకపోవడం వల్లనే ఆంగ్లంలో గురజాడ కథ హిస్టూల్స్‌ టు కంకర్‌ (తెలుగు అనువాదం ‘సంస్కర్త హృదయం) అలభ్యమైంది. అలాగే ఆయన మద్రాస్‌ కాంగ్రెస్‌ మహాసభ గురించి రాసిన ఆంగ్ల వ్యాస కృతి కూడా. ధర్మారావు రచించిన పెళ్ళి పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు పత్రికలలో ధారావాహికంగా వచ్చి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వాటిని గుదిగుచ్చి పుస్తకాల రూపంలో తేవాలి. నలుగురిలోనూ నిలబెట్టాలి.

అలా ఆవిర్భవించినదే ‘తాతాజీ ప్రచురణలు’ అన్న ప్రచురణ సంస్థ, ‘అన్నపూర్ణ ప్రచురణలు’ అన్న సంస్థ. ఆయన జీవితంలో అడుగడుగునా చేదోడు వాదోడుగా ఉన్న మహనీయురాలు ఆయన సతీమణి అన్నపూర్ణ. పెళ్ళయిన కొత్తలో (బాల్యవివాహమే అయినా) ఆయన ఆవిడను పేరుతో పిలవడం ఆ రోజుల్లో గొప్ప సంచలనం. సంప్రదాయాన్ని ధిక్కరించడం. అలాంటి ఉత్తమ ఇల్లాలు 1961లో ఇహలోక యాత్ర చాలించారు. ఆవిడ పేరు మీద అన్నపూర్ణ ప్రచురణలు అనే సంస్థను ప్రారంభించి ధర్మారావు ‘సాహిత్యమొర్మరాలు’ గ్రంథరూపంలో వెలుగులోకి తెచ్చారు. అవన్నీ సాహిత్యపరమైనవి. కాగడా, జనవాణి పత్రికలలో ప్రచురితమైనవి.

‘తాతాజీ ప్రచురణలు’ పేరుతో స్థాపించిన సంస్థ (1962) పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు ముద్రించారు. నాటకాల సంపుటి ప్రచురించారు. ‘ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ’ పేరుతో అంతకు ముందు తాను రాసిన వ్యాసాలను సంకలనం చేసి ప్రచురించారు. ‘పాతపాళీ’ ప్రచురణ మళ్ళీ జరిగింది. తాతాజీ మకుటాయమానమైన కృషి- చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసా’నికి వ్యాఖ్యానం. అది ‘హృదయోల్లాస వ్యాఖ్య’ పేరుతో జనహృదయోల్లాసంగా వెలువడింది. తాపీ ధర్మారావు బహుముఖ కృషి ఇలా పత్రికా రంగంలో, సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో విస్తరించింది.
ఆయన సినీ రంగంలో దాదాపు ఇరవై ఏళ్ళపాటు నలభై చిత్రాలకు రచనా సహకారం అందించారు. సినీ జర్నలిజంలోనూ ఆయన తన ముద్ర చెరగకుండా ఉండేలా చేసుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టుల్ని- మాటలు, పాటలు- గ్రంథరూపంలో ప్రచురిస్తే ఆయన వ్యక్తిత్వం గురించి మరింత విశదంగా తెలుస్తుంది. గ్రాంథిక భాషావాదిగా అరంగేట్రం చేసినా, వ్యావహారిక భాషా వాదిగా ఆయన రచనలు చిరకాలం ఉంటాయి.

24, ఏప్రిల్ 2013, బుధవారం

మందస లో ప్రాచీన ఆలయం

వాసుదేవ ఆలయం
సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినది గా భావిస్తున్న వాసుదేవ ఆలయం నిర్మాణానికి సం బంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. ఎర్రని ఇసుక రాయితో ఒరిస్సా శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. గత శతాబ్ధం చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రంగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించాయి.

ఆలయ చరిత్ర: ఆ కాలంలో మందసా రామానుజులనే ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశి వరకు కూడా పర్యటించి పలు వురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మానపత్రాలను పొందారట. మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారి గు రువు పెద్దజీయరు స్వామివారు, వారి మిత్రులు గోపా లాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది.వారిని ఆదరించిన మందసా రామా నుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు. నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రిం చిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కలవచ్చినది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వాసుదేవ పెరుమాళ్‌ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేయించి, వారు కూడా చేసినారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.

కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరా దరణకు గురి అయ్యి పూర్తిగా శిధిలావస్థకు చేరు కుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది. సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది. ప్రస్తుతం కేవలం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయగోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహు ళ్యానికి దూరంగా ఉండిపోయింది.ఈ సమయంలో 1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారు ఆలయ సందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించా లని సంకల్పించారు. అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకు ని, ఒరిస్సా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆల యాన్ని పునర్నిర్మింపచేసారు.

గురువు పెద్దజీయరు స్వామి వారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకోబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒరిస్సా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ తాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆల యం తప్పక సందర్శించతగినది.దగ్గరలో ఉన్న స్టేషన్‌ పలాస (18 కిమీ). జాతీయ రహ దారి 5 నుండి కేవలం 5 ి.మీ.లు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కి.మీ.లు. విశాఖపట్నం నుండి 200 కి.మీ.లు.

14, మార్చి 2013, గురువారం

ఇచ్ఛాపురం

సంబరానికి సన్నద్ధమవుతున్న స్వేచ్ఛాపురం
Swatchavathi స్వేచ్ఛావతి అమ్మవారి పేరు చెబితే ఇచ్ఛాపురమే గుర్తొస్తుంది. ఆంధ్రా ఒడిషాలతో పాటు దక్షిణ, ఉత్తర భారతానికి సరిహద్దు పట్టణం ప్రసిద్ధి గాంచిన ఇచ్ఛాపురం ఒక నాటి స్వేచ్ఛాపురమే. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి కొలువున్న పట్టణంలో పుష్కరకాలం తరు వాత భారీ ఎత్తున ఉత్సవాలు జరిపించేందుకు గ్రామ పెద్దలు కంకణం కట్టుకున్నారు. 2001 లో రాష్ట్ర చరి త్ర పుటల్లో ప్రత్యేక స్ధానాన్ని దక్కించుకున్న ఇచ్ఛాపు రం అందుకు తలదన్నేలా మరో నాలుగింతల బడ్జెట్‌ తో పెద్దలు రంగంలోకి దిగారు. 2001 అనంతరం ప్రతీ ఐదేళ్లకొకసారి ఉత్సవాలు గ్రామశాంతి కోసం నిర్వహించ తలపెట్టినప్పటికీ పరిస్థితులు సహకరించ కపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. పుష్కరకాలా నికి అమ్మవారి ఆమోదం లభించడంతో ఉత్సవాలతో శాంతింప జేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దఫా ఉత్సాహంతో 108మంది ఉత్సవకమిటీ సభ్యులు న డుంబిగించారు. మార్చి 22న శుభరాట ద్వారా కార్య క్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 22 నుండి 21 రోజులు పాటు ఉత్సవా లను నిర్వహించేందుకు అధికారుల నుండి అనుమతులు పొందేందుకు పెద్దలు సిద్ధమౌతున్నారు.

రక్తధారతో అమ్మవారి జననం
ఇచ్ఛాపురం గ్రామదేవతగా పూజలందుకుంటోన్న శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు రక్తధారతో జన్నించి నట్లు కథనం ప్రచారంలో వుంది. కొన్ని శతాభ్ధాలకు పూర్వమే అమ్మవారు ఈ గ్రామంలో వెలసినట్లు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో కొన్నాళ్లు విపరీతమైన కరువుకాటకాలు ఏర్పడి, కలరా, మశూచి వ్యాధులు ప్రబలడంతో ప్రతీ వీధిలో చిన్నాలు, పెద్ద లు పెద్దసంఖ్యలో మృతిచెందేవారు. అప్పట్లో వేరేదారిలేక చాలా మంది ప్రజలు, గ్రామం, ఇళ్లు విడిచిపెట్టి ప్రాణభీతితో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు.

ఓ వ్యక్తి మాత్రం గ్రామం ఎడారిగా మారినప్పటికీ శ్రమను నమ్ముకుని దైవ భక్తితో అక్కడే వుండిపోయాడు. తనకున్న పొలాన్ని సేద్యం చేస్తుండగా ఒకనాడు నాగలి భూమిలో ఇరు క్కుంది. అతుక్కుపోయిన నాగలిని బయటకు తీసే ప్రయత్నించిన రైతు చెమటలు పట్టి భయాందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వున్న రైతులను కేకలు వేసి సాయం చేయమని కోరగా వారు నాగలి ని బయటకు తీస్తుండగా చివరిభాగం నుండి రక్తం ధార గా చిమ్మడం మొదలుకావడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ వింత చూసేందుకు వచ్చిన గ్రామస్ధులు నాగలిపై చేసే సాహసం చేయలేక, ఎద్దులను ట్లు విప్పి పంపేసి నాగలిని అక్కడే విడిచిపెట్టి వెనుదిరిగారు. అంతా భగవంతునిపై భారం వేసి ఆ రాత్రి నిద్రపోయారు.

ఓ గ్రామపెద్దకు ఆ రాత్రి కలలో బంగారుకాంతితో మెరుస్తూ అలంకార భూషితై , శంఖు, చక్ర, గదాపద్మ , ఖడ్గ శూలపాశ దండములతో, సింహవాహినై చిరునవ్వుతో ఓ దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరించింది. ‘పొలంలో రక్తం చిందించిన చోటనే, నేను శక్తిస్వరూపిణిగా, శ్రీ స్వేఛ్ఛావతి మాతగా ఆవిర్భవించి వున్నాని’ పలికింది. ‘ఇక మీరు భక్తిశ్రద్దలతో ఆరాధిస్తూ ప్రశాంతంగా, స్వేఛ్ఛగా, ఆరోగ్య సౌభాగ్యాలతో వెలగాలని దీవించి మాత అదృశ్యమైంది.

ఉదయాన్నే గ్రామపెద్ద లేచి కొంచెం భయం, ఆశ్చ ర్యం, ఆనందంతో విషయాన్ని గ్రామస్దులుకు తెలియ జేశాడు. దీంతో గ్రామస్దులు మేళతాళాలతో వెళ్లి పొలంలో నాగళి అతుకున్న చోట తవ్వగా అమ్మవారి విగ్రహాన్ని పోలిన రాయికి పెద్ద నాగలి గాటుతో రక్తంకారుతుండడం కన్పించింది. గ్రామస్దులు ఎంతో ధనవ్యయంతో చెక్కడపు శిలలతో, చక్కని శిల్పాలతో అక్కడే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆ దేవికి స్వేచ్ఛావతిగా నామకరణం చేసి గ్రామదేవతగా ప్రతిష్ఠించారు. అక్కడ నుండి గ్రామానికి స్వేచ్ఛాపుర మని పిలవసాగారు. వాడుక లో నేటి ఇచ్ఛాఫురంగా పిలవబడుతోంది.

సంబరాల కోసం
సంబరాల నిర్వహణ కోసం గ్రామలు పలువురు గత ఏడాది భేటీ అయ్యారు. గత ఏడాదే నిర్వహించాలని భావించారు. కొన్ని అడ్డంకుల దృష్ట్యా 2013 కు వాయిదా వేశారు. నిధుల సమీకరణ కోసం తొలుత ప్రతీ దుకాణంలో హుండీలు ఏర్పాటు చేసి విరాళాల సేకరణకు నాంది పలికారు. సుమారు 11 నెలలు కాలంలో రూ. 7 లక్షల మేర విరాళాలు సమకూరాయి.

ఉప్పలవీధిలో అమ్మవారికి స్థానం
ఏప్రిల్‌ 22 రాత్రి అమ్మవారిని మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా పట్టణంలోని ఉప్పలవీధిలో మండపం పై అమ్మవారిని వుంచుతారు. ఆ వీధికి చెందిన ‘నందికి’ వంశస్దులు అమ్మవారి కి కొన్ని తరా లుగా సేవలు చేస్తుండడంతో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆ వంశసు ్ధలకు చెందిన ఓ మహిళ కు అమ్మవారి ని తలపై ఊరేగించే అవకాశం కల్పిస్తారు.

సంబరాలతో మరింత అభివృద్ధి
vallam-patiసంబరాలతో స్వేచ్ఛావతి అమ్మవారి కటాక్షంతో గ్రామం మరింత అభివృధ్ధి చెందు తుందని ఆశిస్తున్నాం. అమ్మవారికి సంబరాల కానుకగా బంగారు ముఖాన్ని సిద్దం చేసి సంబరాల నాటికి అలంకరించే ఆలోచన చేస్తున్నాం. అమ్మవారి బంగారు 44 గ్రాములతో పాటు దాతల నుండి ఒక్కో గ్రాము ద్వారా సేక రించి 350 గ్రాములతో తయారు చేసే లక్షంతో పనిచేస్తున్నాం. ఆలయంలో సిసి కెమరాలతో స్ట్రాంగ్‌ రూం ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేశాం. అన్ని వర్గాలు సహ కరిస్తున్నారు.
వల్లంపాటి సుధీర్‌ కుమార్‌, ఉత్సవకమిటీప్రతినిధి





శాంతి స్వరూపిణి
Icha-(1)శ్రీ స్వేఛ్ఛావతి అమ్మవారు శాంతి స్వరూపిణి. శాంత స్వభావంతో భక్తులకు సుఖశాంతులు అందించే తల్లిగా కొలుస్తారు. చిన్నదేవాలయంగా వుండడంతో దాతల సాయంతో, భక్తుల విరాళాలతో అమ్మవారి ఆలయాన్ని 2003 లో అభివృద్ధి చేసి పునఃప్రతిష్ట చేశాం. ఇన్నేళ్లు సంబరాలు నిర్వహిస్తుం డడం గ్రామానికి ఎంతో శ్రేయస్కరం.
దుర్గాగురుస్వామి,నిర్వాహక కమిటీ ప్రతినిధి
| |

13, మార్చి 2013, బుధవారం

శ్రీకూర్మం

అపురూప శిల్పకళా శోభితం శ్రీకూర్మం
మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువుకు ఈ భూమిపై గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుకే దీనికి ఎనలేని విశిష్టత ఉంది. మహావిష్ణువు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం రూపంలో దైవం ఈఆలయంలో కొలువై ఉంటుంది. అమృతానికై దేవదానవులు క్షీరసాగరమధనం చేయడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉప యోగించారు. ఆసమయంలో వత్తిడికి లోనైన మంధర పర్వతం క్షీరసాగరంలోకి మునిగిపోతుంటే శ్రీమహావిష్ణువు కూ ర్మావతారాన్ని ధరించి పర్వతం కింద ఆధారంగా నిలచి అమృత మధనానికి సాయం చేశాడు. అటువంటి ఆపురూప అవతా రం .  ఈ ఆలయంలో ఈనెల 25నుంచి 27వ తేదీ వరకూ అత్యంత వైభవంగా డోలోత్సవాలను నిర్వహిస్తున్నారు.
14Feaf

ఆలయ విశిష్టత
శ్రీకాకుళం జిల్లా, గార మండలం శ్రీకూర్మం గ్రామంలో శ్రీకూర్మనాథ స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ధి నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.

14Feaప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్‌ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనా థస్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరి స్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.

స్థల పురాణం
13sklmp-13పూర్వం శ్వేత చక్రవర్తి ఈప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన భార్య విష్ణు ప్రియ. ఆమె విష్ణు భక్తురాలు. ఆమె ఏకాదశి ఉపవాస వ్రతంలో ఉన్న సమయంలో ఆమెపై కామాన్ని పెంచుకున్న చక్రవర్తి ఆమెను బలవంతం చేయసాగాడు. ఇది సమ యం కాదని ఆమె వారించింది. ఆయినా సరే రాజు మొండి పట్టుదలను వీడలేదు. ఆమె శ్రీమహావిష్ణువును ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు ప్రసన్నుడైన విష్ణువు వారిద్దరి మధ్య తన ప్రాదోద్భవ గంగను ప్రవహింపజేశాడు. అది నదిగా మారి వేగంగా ప్రవహించింది. అందులో శ్వేత చక్రవర్తి కొట్టుకుని పోతుండగా ఆమె కూడా అతని వెంట వెళ్లింది. శ్వేత గిరిపైకి రాజు, అతని భార్య చేరుకున్నారు. ఆసమయంలో నారద మహర్షి ప్రత్యక్షమై రాజుకు శ్రీకూర్మ మంత్రోపదేశాన్ని చేశాడు. ఈమంత్ర జపం చేయగా విష్ణుమూర్తి కూర్మ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈతపస్సు వలన శ్వేత చక్రవర్తి శరీరం అప్పటికే కృశించి పోయింది. దీంతో కూర్మదేవుడు దిక్కులు పిక్కటిల్లేలా హూంకరించాడు.

13sklmp-16ఈశబ్ధానికి తట్టుకోలేక శ్వేతాచలం అనే ఈపర్వతం భూమిలోకి కుంగిపోయింది. అప్పటినుంచి ఇది ప్రజలకు నివాసయోగ్యంగా మారింది. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలితే అది భూమిని చీల్చిన చోట ఒక సరస్సు ఏర్పడింది. ఇందులో రాజు స్నానం చేసి సంపూర్ణారోగ్యాన్ని పొం దాడు. ఈ సరస్సుకు శ్వేత పుష్కరిణి అనే పేరు వచ్చింది. అప్పటి నుంచీ కూర్మనాధుడు ఇక్కడే స్థిర నివాసంలో ఉండిపో యాడు. శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి కూడా ఇక్కడే కొలువు దీరింది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత శ్వేత పుష్క రిణిని చూసి ఒక కోయరాజు విస్మయానికి గురైతే శ్వేత మహారాజు ఈ వృత్తాంతాన్ని వివరించాడు. ఎంతో సమ్మోహితుడైన కోయరాజు ఆ కోనేటికి గట్లు, మెట్లు నిర్మించాడు. అతడు అక్కడికి పడమర గల సంపంగి మహర్షి ఆశ్రమంలో ఉండి స్వా మిని ఆరాధించేవాడు. తనకు స్వామి ఎల్లప్పుడూ దర్శనమిస్తూ ఉండాలని కోరుకోవడంతో శ్రీ కూర్మనాథుడు పడమటివైపు ముఖం తిప్పుకొని ఉండిపోయాడట.

13sklmp-15అందువల్లే ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ట చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.

ఈమట్టితో తిరునా మాలు దిద్దు కోవడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం.శ్రీకూర్మంలోని పాతాళ సిద్ధేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే శ్రీకూర్మనాథ స్వామిని దర్శించాలని అం టారు. హటకేశ్వరుడు, కర్పూరేశ్వరుడు, కోటీశ్వరుడు, సుందరీశ్వరుడు, పాతా ళసిద్ధేశ్వరుడు శ్రీకూర్మక్షేత్రానికి క్షేత్ర పాలకులు. ఈ ఆలయాన్ని భగవత్‌రామానుజులు, కృష్ణ చైతన్యుడు వంటి ప్రముఖు లెందరో సందర్శిం చి కూర్మనాథుని దర్శనాన్ని చేసుకున్నారు.అన్ని రకాల వైష్ణవ క్షేత్ర ఉత్స వాలు ఇక్కడ జరుగుతాయి. ఈ నెల 25వ తేదీనుంచి 27వ తేదీ వరకూ డోలోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటిరోజు కామదహనం, రెండో రోజు పడియ, మూడో రోజు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉ న్న ఈఆలయానికి వాహన సదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మార్గమధ్యం లోని అరసవల్లి శ్రీసూర్యనారా యణ స్వామిని దర్శించుకుని భక్తులు శ్రీకూర్మం చేరుకోవచ్చు.

---బెందాళం కృష్ణారావు, (మేజర్‌ న్యూస్‌ ప్రతినిధి- శ్రీకాకుళం)

16, ఫిబ్రవరి 2013, శనివారం

సూర్య జయంతి

ఆదిత్య హృదయం
శ్రీ సూర్యనారాయణుడు కనిపించే ఏకైక దైవం... సమయ పాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. భాస్కరుడు ప్రసరించే సహస్ర కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడు తాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహే శ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయం కాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ప్రత్యక్షదైవం. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి. ఈ సందర్భంగా సూర్య ప్రత్యేక కథనం...

sklmp12సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడు కర్మసాక్షి. మాఘశుక్ల సప్తమి నాడు తొలిసారిగా ఈ భూమికి కనిపించి రథమెక్కాడట భాస్కరుడు. ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి. అందుకే రథసప్తమి అయిందని పురాణాలు అంటున్నాయి. సూర్యు డు ఆధ్యాత్మిక విశేషమే కాదు... భౌతిక, ఖగోళ, శారీరక ప్రాముఖ్యం కలిగిన గ్రహనాయకుడు కూడా. సమస్త మాన వాళి ఆరోగ్యం- భాస్కర ప్రసాదంగా చెబుతారు. విదేశీయు లు కూడా సూర్యస్నానం చేసేది అందుకే. ఉదయకాలం పూట కాసేపు సూర్యకాంతికి ఎదురునిలచోవడంలో అంత రార్ధం ఆరోగ్యసూత్రమే. మన సంప్రదాయాల్లోని సంధ్యా వందన నియమం అందుకేనని అంటారు.

ఆయా సమ యాల్లో సూర్యకిరణాలు ఆరోగ్యాన్నందించేవిగా భావించడం వల్లే... సంధ్యావందన నియమాన్ని విధిగా ఆచరించ మని చెబుతోంది భారతీయశాస్త్రం. రథసప్తమి రోజున సూ ర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి పో యి పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సుర్యుని గమనం ఏడు గుర్రాలు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదం ‘హిరణ్యయేన సవితారథేన’ అని తెలు పుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణా యనం అని రెండు విధాలుగా ఉంటుంది. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం.

సూర్యరథం దక్షి ణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూ ర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకం రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. ‘భా’ అంటే సూర్యకాంతి, ‘రతి’ అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీ యులు. ‘భారతీ’ అంటే వేదమాత. వేదమాత నారా ధించువారు కూడా భారతీయులే.

అరసవల్లి ఆదిత్యుడు...
sklmp19అజ్ఞాన తిమిరాన్ని కోటికోట్ల అరుణ కిరణాలతో చెల్లాచెదురు చేసి సమస్త జీవరాసులను మేల్కొలిపే ఆదిదేవుడు ఆదిత్యుడు. అటువంటి సూర్యభగవానుడు మూర్తీభవించిన దైవంగా శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో నిత్యారాధనలు జరిగే ఏకైక సూర్యదేవాలయం ఇదొక్కటి మాత్రమే కావడం ఈ ఆలయ విశిష్టతను చాటి చెబుతోంది. ఆరోగ్య ప్రదాతగా నిలచిన ఆదిత్యుని జయంతి రథసప్తమినాడే జరుగుతుంది.

చరిత్ర పుటల్లో అరసవల్లి...
చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

ఆలయ నిర్మాణం జరిగిందిలా...
sklmp16అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధా నిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంధం దొరికిందని, అందులో సూర్యదేవుని పూ జా విధానాలు ఉన్నాయని వారు మహరాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.

వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాం తంలోని ఆలయాలను సంరక్షించారు. క్రీస్తు శకం 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయా త్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. ఆ తరువాత ఏ ప్రాముఖ్యతా లేని ఈ ఆలయాన్ని 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు పునరుద్దరించారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం అలుదు నివాసి వరుదు బాబ్జీరావు ఆదిత్య ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

స్థల పురాణం...
sklmp24ప్రాచీన చరిత్రలో విశిష్టతకు చిరునామాగా నిలిచిన సూర్యనారాయణస్వామి ఆలయానికి దేశంలోని అన్ని ఆలయాల వలే స్థల పురాణం కూడా వుంది. స్థల పురాణాలకు వేదికైన స్కంధ పురాణాలలో ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించినట్టు చెబుతారు. ఆయన తన వజ్రాయుధంతో తవ్విన చెరువునే ఇంద్రపుష్కరిణిగా పిలుస్తారు. ఆ చెరువులో దొరికిన సూర్యభగవానుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారని స్కంధ పురాణం చెబుతోంది. నాగావళి నదీ తీరంలో బలరాముడు ప్రతిష్టించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించడానికి దేవేంద్రుడు రాగా, తన అనుమతి లేకుండా అతడు వచ్చినందుకు నంది కాళ్లతో తన్నిందని, దాంతో దేవేంద్రుడు అరసవల్లిలో పడ్డాడని అంటారు. నంది ఇచ్చిన శాపవిమోచనం కోసం దేవేంద్రుడు అరసవల్లిలో ఆలయ నిర్మించాడని మరో కథనం ప్రచారంలో వుంది.

సూర్యజయంతే రథసప్తమి...
సూర్యుడు మకరరాశిలోని ప్రవేశించిన తరువాత మాఘమాస శుద్దసప్తమిని రథసప్తమిగా పేర్కొంటారు. ఈ సప్తమి రోజు సౌరకుటుంబానికి కేంద్రమైన సూర్యుడు ఉద్భవించినట్టు చెబుతారు. సూర్యోదయాన్నే... ‘సప్తసప్తమహాసప్త’ శ్లోకాన్ని జపిస్తూ స్నాన మాచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెబుతున్నారు. ఇంద్ర పుష్కరణిలో భక్తులు తలపై జిల్లేడు ఆకులు, రేగుపండ్లు, నువ్వులు పోసుకోని మూడుసార్లు అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తే పునర్జన్మ వుండదని అనాదిగా వస్తున్న నమ్మకం. రథసప్తమి రోజున స్ర్తీ సాంగత్యాన్ని, తైలం, మాంసాహారాన్ని ఎవరు త్యజిస్తారో వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుందని చెబుతారు. స్వామి నిజరూప దర్శన పూజలతో భక్తులకు నవగ్రహ దోష నివృత్తి జరిగి ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం. అందువల్లే రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు సూర్యదర్శనం కోసం తరలివస్తారు.

రథసప్తమి పూజలివిగో...
sklmp8అరసవల్లిలో వెలసిన ఆదిత్యుని సన్నిధిలో రథసప్తమి రోజు ఉదయం మహా అభిషేక సేవ, పంచామృతాలు, సుగంద ద్రవ్యాలతో మూలవిరాట్‌కి మహా అభిషేకం జరుగుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం వల్ల ఈ జన్మలో జన్మంతరాలలో మాటలు, చేతలు, దృష్టిదోషం వల్ల చేసిన పాపాలు, ఏడు జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. భక్తులకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో మట్టిపొయ్యి మీద బియ్యం, పాలు, పంచదార లేదా బెల్లంతో తయారుచేసిన క్షీరాన్నాన్ని వండాలి. పందిరి చిక్కుడు ఆకుల మీదగాని తెల్ల జిల్లేడు ఆకుల మీదగాని ఆ క్షీరాన్నాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యం పెట్టాలి.

ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. సూర్యజయంతి రోజున ఎర్ర చందనం (రక్తచందనం) అష్టదళ పద్మం వేసి (8 ఆకులమీద) సూర్యనారాయణ స్వామిని ఆవాహనం చేసి ఉపచార పూజలు చేయాలి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని పద్మ, బ్రహ్మ పురాణం, సౌరపురాణాలు చెబుతున్నాయి.

ఆదిత్యునికి నామాలెన్నో...
‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అని మాతృ పురాణం లో, ‘దివే శం సుఖార్ణ’ అని స్కందపురాణంలో, ‘తేజ స్నామో విభా వసు’ అని శ్రీమద్భాగవతంలో, ‘ఆదిత్య హృదయం పారా యణం సర్వశత్రు వినాశన’ అని రామాయణంలో శ్రీసూ ర్యభగవానుని ప్రస్తుతించారు. అంతటి మహిమాన్వితుడు, ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత, గ్రహరాజు, త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుని మాసానికో పేరుతో పిలు స్తారు. అంటే 12 నెలలకు పన్నెండు పేర్లు... చైత్రమాసం లో ‘మిత్ర’ అని, వైశాఖంలో ‘రవి’, జ్యేష్టంలో ‘సూర్య’, ఆషాడంలో ‘వాసు’, శ్రావణంలో ‘ఖగ’, భాద్రపదంలో ‘పూష’, ఆశ్వయూజంలో ‘హిరణ్యగర్భ’, కార్తీకంలో ‘మరీచ’, మార్గశిరంలో ‘ఆదిత్య’, పుష్యంలో ‘సవిత్రు’, మాఘంలో ‘అర్క’, ఫల్గుణంలో ‘భాస్కరుడు’ అని పిలుస్తారు. భారతదేశంలో సూర్యభగవానునికి నిత్యపూజ, అర్చన జరిగే దేవాలయం అరసవల్లి మాత్రమే.

అపురూపం ఆదిత్య స్వరూపం...
అరసవల్లిలో వెలసిన ఉషా ఛాయా పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేకత లేని ది అంటూ ఏది లేదు. స్వామివారి దేవాలయం, సూర్య కిర ణాలు, ఇంద్ర పుష్కరిణికి ఎంత ప్రాధాన్యం ఉందో స్వామి వారి విగ్రహానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. స్వామివారిని కృష్ణ శిలతో కళాత్మకంతో తీర్చిదిద్దిన ఏక శిలా విగ్రహం ఇక్కడ వుంది. దీనికి అరుణ శిల అని కూడా ప్రసిద్ధి. దీనికి కారణం మూల విరాట్‌ను అరుణ అనే ప్రత్యేకమై శిలలో దేవ శిల్పి విశ్వకర్మచే చెక్కించారు.

ఆదిత్యునికి ఆరుణ శోభ...
sklmp7సకల జీవులకు ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుడు ప్రతీ ఏడాది అక్టోబరు, మార్చి నెలలో అరుణ శోభను సంతరించుకుంటాడు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి మారే సందర్భాలలో సూర్యకిరణాలు స్వామివారి ధృవమూర్తిని తాకుతాయి. ఆ సమయంలో బాలభాను ని లేలేతకిరణ స్పర్శకు ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోతూ అరుణశోభలో భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రతీ ఏటా మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు, అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు కనిపించే ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తరించడానికి దేశం నలు మూలల నుం చి భక్తులు తరలి వస్తుంటారు. ఆదిత్యున్ని పాదాలను సుమారు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకే దృశ్యం ఆలయ నిర్మాణ నైపుణ్యానికి దర్పణంగా నిలుస్తోంది. గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆలయ వాస్తునిర్మాణం లోనే ఈప్రత్యేకత ఉంది. చాలా వరకూ ఆలయాలు ఉత్తరాభిముఖంగా ఉంటే ఈ ఆలయంలో మాత్రం ముఖద్వారం తూర్పునకు అభిముఖంగా ఉంటుంది.

అదిత్యారాధన అన్నింటికీ మాతృక...
sklmp1సూర్యభగవానుని ఆరాధన ను నిత్యం ఆచరిస్తే... వారికి మోక్షం లభిస్తుంది. సూ ర్యారాధనలోనే సకల దేవతారాధ నల మూలాలున్నాయి. రథసప్త మి రోజు అత్యంత శ్రేష్టమైన పర్వ దినం. ‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అన్ని జీవరాసులకూ ఆరోగ్యప్రదాత ఆదిత్యుడే... నిత్యం సూర్యనమస్కారాలు చేసేవారికి ఎటువంటి ఆనారోగ్య సమస్యలూ తలెత్తవు.
- ఇప్పిలి శంకర శర్మ,
అరసవల్లి ఆలయ ప్రధానార్చకులు


రథసప్తమి నాటి శిరస్నానం వేళ వరిచం వలసిన శ్లోకం..
శ్లో య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
 తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
 ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
 మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
 ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
 సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జన్మజన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసి న సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రథసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!

ప్రతీయేటా సూర్యదేవుని దర్శనం
sklmp3ప్రతీయేడాది రథసప్త మికి శ్రీకాకుళంలో ని అరసవల్లి వచ్చి సూర్య దేవుని దర్శనం చేసుకుం టున్నాను. సూర్యభగవా నుడే ఈ విశ్వమంతటికీ ప్రత్యక్ష దైవం. ఆయన వ లనే సకలజీవరాశులకూ చైతన్యం కలుగు తోంది. ఆయనని నిత్యమూ ఆరాధిస్తాను.
- కె. ఇందిర, గృహిణి,
బరంపురం (ఒడిషా)


రథసప్తమికి అన్ని ఏర్పాట్లు
sklmp2ఆదివారం జరగనున్న సూర్య జయంతోత్సవానికి (రథ సప్తమి) సంబంధించి అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేసాం. ఆలయ అ నివెట్టి మండపంతో పాటు, ఆల య గోపురం, ముఖద్వారాలకు రంగులువేయించాం. ఇంద్రపు ష్కరిణి ఆవరణలో కర్రలతో ఉచిత క్యూలైన్లను ఏర్పాటు చేసాం. బ్లాకుల వారీగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు స్వామివారి ప్రసాదం లక్షకుపైగా లడ్లు అందించడానికి తయారు చేయిస్తున్నాం.
- ప్రసాద్‌ పట్నాయక్‌, ఈవో


ఆదిత్య హృదయం - పారాయణ
రామచంద్రుడు రావణుణ్ణి ఎలా వధించాలి అని చింతిస్తుండగా అగస్త్యుడు వచ్చి... భయాలు శత్రుపీడ తొలగడానికి, ఆరోగ్యం, విజయం, శుభం కలగటానికి ఇది చదువుకో అని ఆదిత్య హృదయన్ని భోదించాడు. అది చదివాక రాముడు రావణుణ్ణి అవలీలగా సంహరించగలిగాడట. విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమోత్తమ గ్రంథరాజమని ఆనాడు అగస్త్యుడు రామ చంద్రునికి ఆదిత్య హృదయాన్ని చెబితే, దాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో అదించాడు.

sklmp17అది సూర్యుడి గురించి అందించిన స్తోత్రం కనుక సూర్యుడి ఆవిర్భావ దినం అయిన రథసప్తమి నాడు చేస్తే మంచిది. అది జరిగింది ఈ మాఘమాసంలో కనుక ఈ మాసం మొత్తం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయ్యవచ్చు. మాఘమాసంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య దాకా రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానంచేసి, పాయసాన్ని తయారు చేసి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్యుడికి పాయసాన్ని నివేదన చేసి నలుగురికి పంచడం చేస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందినవాళ్ళం అవుతాం. రాముడు లంకలో ఉన్న రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి దగ్గరికి చేర్చుకున్నాడు.

రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఉన్న లంకానగరం వంటిదే మన శరీరం. మనలో రాజసిక, తామసిక, సాత్విక ప్రవృత్తులు ఉంటాయి. రాజసిక, తామసిక గుణములని అణిచివేయాలి, సాత్వికాన్ని పెంపొందించుకోవాలి. అదిత్యహృదయ పారాయణ వల్ల మనలో అంతర శత్రువులు అయిన రాజసిక, తామసిక ప్రవృత్తులని అణిచివేయగలుగుతాం.

సూర్య రథం ప్రత్యేకత
Devkaఅధితి, కశ్యపుల పుత్రుడు సూర్యుడు. సూర్యుడు బంగారు రథం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూ ర్యుడి బంగారు రథానికి ఒకే ఒక్కచక్రం ఉం టుంది. ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటా యి. రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. ఒక చక్రం సంవత్సరానికి, ఆరు ఆకులు ఆరు ఋతువులకి, ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు, ఇంద్ర ధనస్సులోని ఏడు రంగులకు సంకేతంగా చెబుతారు. సర్వసాక్షీ భూతుడైన సూర్యభగవానుడు కాలానికి కర్త కనుక మన ప్రాచీనులు ఆ విషయాన్ని ఈవిధంగా ప్రతీకాత్మకంగా తెలియజేశారు.
సప్తాశ్వ రథమారూఢమ్‌ ప్రచండం కాశ్యపాత్మజమ్‌
శ్వేత పద్మ ధరం దేవమ్‌తం సూర్యం ప్రణమామ్యహమ్‌
సప్తాశ్వాల పేర్లు...
1. గాయత్రి
2. బృహతి
3. ఉష్ణిక్కు
4. జగతి
5. త్రిష్టుప్పు
6. అనుష్టుప్పు
7. పంక్తి

ఎంతో ఆనందదాయకం
sklmp4సూర్య భగవానుని ఆలయం మా శ్రీకాకుళంలో ఉండ డం ఎంతో ఆనందదాయకం. సూర్య జయంతి రోజున ఈ రాష్ట్రంలోని భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. సూర్య భగవానుని దర్శనం, ఆరాధన నిత్య జీవితంలో భాగం కావాలి. ఆయన ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారు.
- కొమ్మాజోస్యుల వసంతకుమార్‌ (శ్రీకాకుళం)


రథసారధి అనూరుడు
అనూరుడు అనగా ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే అరుణుడు (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినత. ఈమె సవతి కద్రువ. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవిస్తారు. వినతకు రెండు గుడ్లు పుడతాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళే నాగ సంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలకపోవడంతో...

లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపో తుంది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూస్తుంది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపిస్తాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినం దుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రు వకు దాసిగా ఉండమని శపిస్తాడు. రెండవ గుడ్డులో మహా బలాఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్దని చెబుతాడు. అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరు డికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టు కుని వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసు కుంటాడు. గరుత్మం తుడినే గరుడుడు అని కూడా అంటా రు. అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన సంపాతి, జటాయువులు వీరి కుమారులు.

భాగ్యనగరంలో ఆదిత్యుడు!
HYDమన హైదరాబాద్‌లోనూ ఓ సూర్యదేవాల యం ఉన్నది. సికింద్రాబాద్‌లోని తిరుమల గిరిలో నిర్మిపబడిన శ్రీ సూర్య భగవాన్‌ దేవాల యం దిన దిన ప్రవర్ధమానమవుతూ అనేకమంది భక్తులనాకర్షిస్తున్నది. శ్రీ సూర్యశరణ్‌ దాస్‌ మహ రాజ్‌ సూర్య భగవానుని భక్తులు. శ్రీ సూర్య భగవా నుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్‌ దాస్‌ 1959లో ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్య దేవుని ప్రతిష్టించి పూజించసాగారు. శ్రీ సూర్య శరణ్‌ దాస్‌ దేవాలయ నిర్మాణాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మింపబడింది ఈ ఆలయం. గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతిమీద మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్క రించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతినానుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు. పక్కనే అశ్వథ్థ, వేప చెట్లు కలిసివున్న వేదిక ఉంటుంది. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి, ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజాల పక్కనే ఆరుబయలే అత్యంత సుదరంగా వెలసిన శివలింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగ దేవత, మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్వామి ఉపాలయాలున్నాయి. నాగ దేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలున్నాయి.

దేవ్‌కా సూర్య దేవాలయం
దేవ్‌కా సూర్య దేవాల యం రాజస్థాన్‌లోని ఓ జిల్లాకేం ద్రమైన బార్మర్‌ పట్టణానికి 62 కి.మీ.ల దూరంలో ఉన్న దేవ్‌కా అనే చిన్న గ్రామంలో ఉన్నది. 13వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం విశిష్టమైన శిల్ప సంపద కలిగి పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇక్కడే విష్ణు దేవాలయం, మరో రెండు చిన్న దేవాలయాలు కూడా పర్యాటకులు చూడవచ్చు. వాటిలో ఒకటి గణేశ దేవాలయం.

మోఢేరా సూర్య దేవాలయం
Modheraగుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న ‘పుష్పవతి’ నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్‌ సోలంకి- నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025- 1026 ప్రాంతంలో సోమనాథ్‌ మరియు చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణ దారుడైన మహమూద్‌ హమద్‌ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే అహిల్‌వాడ్‌ పాటణ్‌ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది.

తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది.

కోణార్క్‌ సూర్యదేవాలయం
Konarkభారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సూర్యదేవాలయం... కోణార్క్‌ సూర్యదేవాలయం. ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోణార్క్‌లో సముద్ర తీరాన నిర్మించిన సూర్య దేవాలయం కలదు. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రథానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది.


- బెందాళం క్రిష్ణారావు,
మేజర్‌ న్యూస్‌ ప్రతినిధి, శ్రీకాకుళం

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

బొబ్బిలి వీణ

 బొబ్బిలి వీణ....భళారే..
1757లో బొబ్బిలి యుద్ధం జరిగిన తరువాత చిన్నాభిన్నమైన బొబ్బిలి సంస్థానం 1802 నాటికి కానీ కుదుటపడలేదు. రాజా రాయుడప్పారావు, శ్వేతా చలపతి రంగారావు తదితరులు పరిపాలనా పగ్గాలు చేపట్టిన తరువాతనే సంస్థానం మళ్లీ సంగీత, సాహిత్య సౌరభాలతో గుభాళించింది. వీరి కాలంలోనే ముఖ్యంగా వైణిక సంప్రదాయం విరాజిల్లింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరు సందర్శించారు. మైసూరు సంస్థాన దర్బార్‌లో వీణ కచేరి వినడం తటస్థించింది. ఆనాడు వీణ తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేతను చూపించేవారట. అది గమనించిన బొబ్బిలి రాజా తన సంస్థానంలోని ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. అదే వీణ తయారీలో బొబ్బిలి రాణించడానికి అంకురార్పణ అరుుంది.

Untitle1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డు లభించింది. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అప్పటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి నుంచి అవార్డు అందుకున్నారు. ఆనాడు మయూరి వీణను రూపొందించడం తన ఆశయంగా వీరన్న ప్రకటిం చారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ బొబ్బిలి వీణకు మురిసిపోయి సర్వసిద్ధి వెంకట రమణను వైట్‌హౌస్‌కు రావలసిందిగా ఆహ్వానించడం చెప్పుకోదగినది. ఈమని శంకర శాస్ర్తి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎంత ఘన చరిత్ర కలిగినా, ఇప్పుడు ఈ వృత్తిపని వారి మనుగడ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నది. దీనికి కారణం వీణల తయారీకి కావలసిన పనస, సంపెంగ చెట్ల కలప సరిగ్గా లభించక పోవడం. అటవీ శాఖ ఆంక్షలు విధించడం కూడా మరొక కారణం.

ఇప్పుడు మామూలుగా వాయించే వీణలకన్నా, బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలకు ఎంతో గిరాకీ ఉంది. ఏటా 300 వరకూ పెద్ద వీణలు బొబ్బిలిలో తయారవుతుంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలితోపాటు బాదంగి మండలం వాడాడలో కూడా వీణలను తయారు చేసే కుటుంబాలు సుమారు 45 వరకూ ఉన్నాయి. వీరు నెలకు 400 వరకూ గిఘ్ట వీణలను రూపొందిస్తు న్నారు. ఈ వీణలను లేపాక్షి సంస్థ మార్కెటింగ్‌ చేస్తోంది.గిఫ్ట్‌ వీణ తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. ఒక్కొక్క గిఫ్టు వీణపై 400 రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. ఇందులో వంద రూపాయిలు పెట్టుబడిగా పోతుంది. అలాగే పెద్ద వీణకు 4 వేల రూపాయిలు పెట్టుబడి పెడితే 5 వేల రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. విదేశాలకు ఈ వీణలు ఎగుమతి అవుతుంటాయి. ఏటా 14 లక్షల రూపాయిల వరకు టర్నోవర్‌ ఉంటుంది.

కాగా ఆ మధ్య బొబ్బిలి వీణలను టోకున కొనుగోలు చేసి హరిదాసులకు పంపిణీ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ కాంట్రాక్టును హస్తకళల కేంద్రం వారు చేపట్టి సుమారు 400 వీణలను తయారుచేయించి తిరుమలకు పంపించారు. కొన్నాళ్ల పాటు ఈ పనులు వీణ తయారీ కార్మికు లకు ఉపాధి కల్పించాయి. తంబురా ఆకారంలో ఉన్న ఈ వీణలను చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, అధికారులు ఎంతో ముచ్చటపడ్డారని కళాకారులు ఇప్పటికీ చెబుతుంటారు.మన రాష్ట్రానికి ఎలాంటి విశిష్ట అతిథి వచ్చినా వారికి ఇచ్చే విలువెన బహుమతి బొబ్బిలి వీణే. ఇలా అందుకున్న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వీణ మలిచిన తీరుకు అబ్బురపడి ఇక్కడి కార్మికులను వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇది బొబ్బిలికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకుంటారు.

బొబ్బిలితో పాటు వివిధ గ్రామాల్లో వీణలు తయారు చేసి అమ్ముతున్న కళాకారులను ఒక్కచోటకు చేర్చి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన 2001లో ప్రభుత్వానికి వచ్చింది. గొల్లపల్లిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ‘రాష్ట్ర హస్త కళల సంస్థ’ ద్వారా వీణలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. దీంతో సుమారు 200 మంది కార్మికులు ఈ కేంద్రంలో చేరారు. అయితే పనస కలప కొరతతో అందరికీ చేతినిండా పనిదొరికే పరిస్థితి కనిపించడంలేదు. కలపను అవసరమెనంత మేర అందించేందుకు వీలుగా పనస వనాలను పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. చేవగల కలప దొరకక పోవడంతో ఒడిశా తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో పెట్టుబడి ధర రెండింతల వుతోందని కార్మికులు వాపోతున్నారు. అదీగాక హస్తకళల సంస్థ కొనుగోలు చేస్తున్న ధరకు, బయటి మార్కెట్‌ ధరకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఒక్కో వీణకు సుమారు రూ. 2 వేలు వరకు లాభం వస్తుందని ఆశపడే కార్మికులకు నష్టమే ఎదురవుతోంది.

పిండికొద్దీ రొట్టె చందంగా ఇక్కడి వీణలు ధరను బట్టి మోగుతాయి. స్వరాలు పలికించే వివిధ ఆకృతుల వీణలు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు ఉన్నాయి. సంగీతంలో ప్రవేశం ఉన్నవారు మాత్రమే ముందుగా ఆర్డరిచ్చి వీటిని చేయించుకుంటారు. ఇక బహుమానాలకు ఇచ్చే వీణలు రూ.400 నుంచి రూ. 2 వేల మధ్య ధర పలుకుతాయి. తయాఆయనలో అంతర్లీనంగా రచయిత కూడా ఉన్నారు. ఇన్ని కళలను ఒక్కడే అభ్యసించడం ఆశ్చర్యకరమే. తాడేపల్లికి చెందిన శ్రీనివాసవర్మ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కొంతకాలం పనిచేశారు. మొదట్లో ఇంద్రజాలికునిగా కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ మెజీషియన్లు భయంకర్‌, పరుశురామ్‌ల పర్యవేక్షణలో శిక్షణ మొదలుపెట్టారు. చేయి తిరిగిన ఇంద్రజాలి కునిగా వారివద్ద అశేష అనుభవం గడించారు.

Unt2ఒక్కో ప్రదర్శనలో దాదాపు 40కి పైగా అద్భుతమైన ఐటమ్‌లు ప్రదర్శించేవారు శ్రీనివాసవర్మ. విజయవాడ, హైదరాబాద్‌, ఏలూరు, కైకలూరు, భీమవరం వంటి ప్రాంతా లలో పలు ప్రదర్శనలు చేసి ప్రశంసలు పొందారు. ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో మెజీషియన్‌ ప్రదర్శనలిచ్చే ఉద్యోగిగా కొంతకాలం చేశారు. అలాగే మౌంట్‌ ఒపేరా ఎమ్యూజింగ్‌ పార్కులో కూడా ఒక నెలరోజులు ఈయన చేసే సాహసోపేతమైన హర్రర్‌ ట్యూబ్‌లైట్‌ ఫీట్‌ (ట్యూబు లైట్‌ని నమిలి గాజుపెంకులుగా చేయడం), నోట్లో కిరోసిన్‌ పోసుకుని మంటలు ఊదుతూ భయోత్పాతం కలిగే రీతిలో ఆనందంగా నృత్యం చేయడం కేవలం అతనికే సాధ్యమయింది. ఒక్కో సారి ఈ సాహస కృత్యాల ఫీట్‌లో తన ఒంటికి గాయం అయినా అవన్నీ లెక్కచేయని తత్వం ఆయనది. తాను చేసే సాహసకృత్యాలలో ప్రమాదం పొంచి ఉన్నా ప్రేక్షకులు వినోదంతో అందించే ఉత్సాహపూరితమైన చప్పట్లే తనకు ప్రోత్సాహం ఇస్తాయంటారు.

త్వరలో హైదరాబాద్‌ త్యాగరాయగాన సభలో జరిగే కార్యక్రమంలో తన ప్రదర్శనలు ఇస్తానంటున్నారు శ్రీనివాసవర్మ. కేవలం కళనే నమ్ముకుని ఒంటిపై గాయాలను కూడా లెక్కచేయకుండా పొట్టకూటికోసం చేసే విన్యాసాలకు ఏనాటికైనా ప్రభుత్వ గుర్తింపు రాకుండా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఆయన.
రీ, అమర్చే గాజుపెట్టె ... ఇలా హంగులన్నింటికీ కలిపి ధర నిర్ణయిస్తారు.

(సూర్య నుంచి)

2, ఫిబ్రవరి 2013, శనివారం

గరిమెళ్ళ

గరిమెళ్ళ సత్యనారాయణ


శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం.
గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచార ఫలకం.
 
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

తొలి జీవితం

గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాధమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.

జాతీయోద్యమ స్ఫూర్తి

1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ' మా కొద్దీ తెల్లదొరతనం పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా- ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు , గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతట మహత్తర శక్తి ఉందో , సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ.
మాకొద్దీ తెల్లదొరతనం- దేవ
మాకొద్దీ తెల్లదొరతనం అంటూ
ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.
శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించాడు. గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే వున్నాడు. అంతటి దేశ భక్తుడు ఆయన.

బతుకు పుస్తకం

జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు. ఆయన జీవితంలో మధుర ఘట్టం ఇదొక్కటే. ఆ తరువాత కొద్దిరోజులకు భార్య చనిపోయింది. అప్పుడాయనకి ఇద్దరు కుమార్తెలు. గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. అప్పులు పెరగడంతో వున్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చాడు. ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు. శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చువేశాడు. అవి అమ్ముడుపోలేదు. ఆయన ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తిరుగుతూ వుండడంతో, వాటిని పట్టించుకోక పోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి. వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది.

రచనలు

1921 లో గరిమెళ్ళ ' స్వరాజ్య గీతములు ' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ' ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.

చివరిదశ

గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు.
స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ' మాకొద్దీ నల్ల దొరతనం ' అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట. చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు.